![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -392 లో.. లాస్ట్ వాలింటైన్ డే ఎంత బాగా జరిగిందంటు మురారి నీ చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది ముకుంద. ఈ ఛాన్స్ వస్తోందో రాదోనని దూరంగా ఉండి మురారితో సెల్ఫీ తీసుకుంటుంది ముకుంద. ఆ తర్వాత ఆదర్శ్ తన కబోడ్ లో ఉన్నవాటిని ఈవెంట్ ఆర్గనైజర్ వాళ్లకి ఇచ్చి.. డోర్ వేస్తుండగా అందులో ముకుంద మురారీల ఫొటో కన్పిస్తుంది. అంతేకాకుండా ఆదర్శ్ మురారి ఉన్న ఫొటో లో ఆదర్శ్ సైడ్ ఫోల్డ్ చేసి ఉంటుంది. దాన్ని చూసి ఆదర్శ్ షాక్ అవుతాడు.
ఆ తర్వాత ఎందుకు నా వైపే ఫోల్డ్ చేసిందంటే ఇంకా మురారి అంటే ఇష్టమా అని ఆదర్శ్ ఆలోచనలో పడుతాడు. ఈవెంట్ వాళ్ళు కబోడ్ లో ఉన్నవాటిని తీసుకొని వస్తుంటే.. ఇవి ఎవరు ఇచ్చారని మురారిని ముకుంద అడుగుతుంది. ఆదర్శ్ ని ఇవ్వమని పంపించానని మురారి చెప్పగానే.. అక్కడ ఆదర్శ్ ఫోటోస్ చూసాడేమోనని ముకుంద కంగారుగా వెళ్తుంది. మరొక వైపు ఆదర్శ్ ఎక్కడ ఫోటోస్ అక్కడే పెట్టి పక్కకి వచ్చి ఆలోచిస్తుంటాడు. ముకుంద వచ్చి ఆ ఫొటోస్ చూసి ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఆదర్శ్ చూడలేదు అన్నమాట. ఈ ఫొటోస్ ని దాచిపెట్టాలని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత ముకుందని నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా అని ఆదర్శ్ తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత డెకరేషన్ ఎలా ఉందని కృష్ణని మురారి అడుగగా.. బాగుందని కృష్ణ చెప్తుంది. ఈ రోజుతో ముకుందపై పెద్దత్తయ్యకి ఉన్న అనుమానాలు తొలగిపోతాయని కృష్ణ అంటుంది. ఆ తర్వాత కృష్ణకి మురారి హ్యాపీ వాలింటైన్ డే అని చెప్తాడు. వాళ్లని మధు ఫొటోస్ తీస్తుంటాడు. ఆ ప్లేస్ లో నేను ఉండేదాని అని ముకుంద అనుకుంటుంది.. కృష్ణ, మురారి ఇద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ముకుంద అనుకుంటుంది. ఈ ప్రపోజ్ ఫోటో ని ఫేమ్ కట్టించాలని వారిద్దరితో ముకుంద అంటుంది. ఇప్పుడు ఆదర్శ్ కూడా నిన్ను ఇలాగే ప్రపోజ్ చేస్తాడని కృష్ణ అంటుంది.
ఆ తర్వాత ఇష్టం లేదేమోనని మధు అనగానే.. ఎందుకు అలా అంటావ్. ఫోటోస్ కదా ఇష్టం వచ్చినట్లు తీసుకోమని ముకుంద అంటుంది. ఆ తర్వాత నువ్వు వెళ్లి ఆదర్శ్ ని తీసుకొని రా అని మధుని మురారి పంపిస్తాడు. కాసేపటికి ఆదర్శ్ వస్తాడు. అందరు వాలైంటైన్ డే సెలబ్రేషన్ కు వచ్చి కూర్చొని ఉంటరు. జడ్జిగా భవాని ఉంటుంది. ఆదర్శ్ ని చూస్తే ఫోటోస్ చూసాడేమోనని డౌట్ ముకుందకి వస్తుంది. తరువాయి భాగంలో.. జల జల జలపాతం నువ్వు అనే పాటకి ఆదర్శ్, ముకుందలని చెయ్యమని చెప్తారు. కానీ ముకుంద మాత్రం మురారిని ఊహించుకొని ఆదర్శతో కలిసి డ్యాన్స్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |